దేశంలో గత పదేండ్లుగా రామరాజ్యం నడుస్తున్నది. అయోధ్య రాముడి ఆశీస్సులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు. తాను పుట్టిన ఊరిలో తన ఆలయాన్ని పునరుద్ధరించమని రామయ్యే ఆదేశించినట్టుగా.. మోదీ సారథ్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే జనవరిలో నరేంద్రుడి చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరుగనున్నది.
చరిత్ర సంక్షిప్తంగా..
ప్రాచీన భారతీయ ఇతిహాసం ప్రకారం.. రాముడు అయోధ్యలో జన్మించాడు. ఇదే రామజన్మభూమి అని కోట్లాది హిందూవుల నమ్మకం. ఇక్కడే 16వ శతాబ్దంలో మొగలులు బాబ్రీ మసీదును నిర్మించారు. దీంతో హిందువులు, ముస్లింల మధ్య ఈ స్థలంపై 1850 నుంచి హింసాత్మక వివాదం తలెత్తింది. 1980 దశకంలో విశ్వహిందూ పరిషత్ ఈ స్థలంలో రామాలయాన్ని నిర్మించడానికి కొత్త ఉద్యమాన్ని చేపట్టింది. 1989లోలో వివాదస్పద మసీదు పక్కనే ఉన్న భూమిలో ఒక ఆలయానికి పునాదులు వేసింది. 1992 డిసెంబర్ 6న వీహెచ్పీ, బీజేపీ, కరసేవకులు అనబడే వలంటీర్లు లక్షలాదిగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ హింసాత్మకంగా మారి.. మసీదు కూల్చివేతకు గురైంది. అనంతరం పలుచోట్ల అల్లర్లు జరిగాయి. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లలో ఉన్న హిందూ ఆలయాలకు దాడులు జరిగాయి.
రామమందిర నిర్మాణానికి అడుగులు..
ఎన్నో గొడవలు, అల్లర్లు, వివాదాల అనంతరం..అయోధ్య వివాదంపై 2019లో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. దీని ప్రకారం.. రామ మందిర నిర్మాణం కోసం వివాదస్పద భూమిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అప్పగించింది. చివరికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ట్రస్ట్ ఏర్పడింది. కొత్త మసీదు కోం వేరే చోట 5ఎకరాల భూమిని కేటాయించారు.2020 ఫిబ్రవరి 5న ఆలయాన్ని నిర్మించే ప్రణాళికను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. లార్సన్ అండ్ టూబ్రో ఈ పనులను పర్యవేక్షిస్తున్నది. కోట్లాది భక్తులు ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది.
ప్రారంభోత్సవ వేడుకకు ముహూర్తం..
2024 జనవరి 17 నుంచి ఐదు రోజుల పాటు ప్రారంభ వేడుకలు నిర్వహించాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
బీజేపీకి ఇక తిరుగులేదు..
రామమందిర నిర్మాణంతో కోట్లాది హిందూవుల ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత కచ్చితంగా ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వానిదే. దశాబ్దాలుగా ఆలయ నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసిన కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు తగిన విధంగానే బుద్ధి చెప్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. రామ మందిర నిర్మాణంతో దేశ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రధాని మోదీని మూడోసారి దీవించేందుకు అంతా కంకణబద్ధులై ఉన్నారని చెప్పడంతో సందేహం అక్కర్లేదు.




