In 100 Success Modi Govt

భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుని.. ప్రపంచం ముంగిట కొత్తశక్తిగా ఆవిర్భవించింది. వికసిత భారతం నిర్మించే లక్ష్యం వైపు దూసుకెళ్తుతున్నది. ప్రధాని మోదీ సారథ్యంలో టీమిండియా తన విజయచరిత్రను లిఖించుకుంటున్నది. అమృత కాలపు శుభఘడియల్లో ప్రపంచంలో మూడో ప్రపంచంగా తీర్చిదిద్దబడుతున్నది. ఓ వైపు అమెరికా, మరో వైపు చైనాలగా మారిన ప్రస్తుత తరుణంలో మూడో శక్తిగా భారత్ అవతరించింది. బీజేపీ పాలనలో భారత కీర్తిపతాక వేనోల్ల కీర్తించబడుతోంది. ‘‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని ప్రధాని మోదీ సూచనను ప్రపంచం శ్రద్ధగా అలకిస్తోంది. గత ప్రభుత్వాల కాలంలో ఎన్నడూ సాధ్యపడనిది.. గొప్ప దేశభక్తుడి పాలనలో వాస్తవమై నిలిచింది.

మూడో శక్తిగా ఎదిగిన తీరు..
-వరల్డ్ బ్యాంకు అధ్యయనం ప్రకారం..2019 నాటికి దేశంలో దుర్భర దారిద్ర్యం 10.2శాతానికి తగ్గింది. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన పురోగతిని సాధించాయి. దీనికి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలే ఆలంబనగా నిలిచాయి.

– కేంద్రం ‘గతిశక్తి’ పేరిట తెచ్చిన పథకం దేశ ప్రజల కలలను సాకారం చేస్తోంది. రూ.100లక్షల కోట్లకు పైగా చేపట్టే నిధులతో లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

-కరోనా మహమ్మారిని ‘జన భారతం’ సమర్థంగా ఎదుర్కొవడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా, బ్రిటన్, రష్యాలాంటి దేశాలకు దీటుగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లు తయారు చేయడంలో మన శాస్త్రవేత్తలు అద్భుత విజయం సాధించారు. 140కోట్ల ప్రజలకు ప్రాణదానం చేశారు. పేద దేశాలకు సైతం వాటిని సరఫరా చేసి వాటికి ‘పెద్దన్న’లాగా మారిపోయాం. ఆపదొస్తే అమెరికా, యూరప్ దేశాల వైపు చూసే పరిస్థితిని మోదీ ప్రభుత్వం మార్చేసింది.
– భారత ఆర్థిక వ్యవస్థ 2022లో ప్రపంచంలో 7.2శాతాన్ని కలిగిఉన్నది. పర్చేజింగ్ పవర్ పారిటీ(పీపీపీ) లెక్కలను బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతోంది. అతి కొద్ది కాలంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారనున్నది.

-చంద్రయాన్-3తో విజయంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో తనదైన మార్కు నిలుపుకుంది. హాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చుతో చంద్రుడిపైకి ప్రయోగం చేపట్టి సక్సెస్ కావడంతో భారత అంతరిక్ష కీర్తి నింగినంటింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా పేరుగడించింది.

అన్ని రంగాల్లో అగ్రస్థానానికి..
కాంగ్రెస్ పాలనలో కునారిల్లిన దేశానిని మోదీ పాలన నూతన జవసత్వాలు చేకూర్చింది. ప్రతీ రంగంలోనూ తనదంటూ బ్రాండ్ నిలుపుకుంటూ ముందుకెళ్తున్నది. స్కీం అంటే స్కాం అనే కాంగ్రెస్ పాలన రోజుల నుంచి స్కీం అంటే 100శాతం సక్సెస్ అనే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసే ప్రతీ పైసా పేదల వరకు చేరుతున్నది. వారి కుటుంబాల్లో వెలుగులు పంచుతున్నాయి. ప్రధాని మోదీ అకుంఠిత శ్రమ ఫలాలు.. అణగారిన కుటుంబాలకు అందుతున్నాయి. 2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలిపే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశ్వగురుగా భారత్ ఆవిర్భవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పడానికి ప్రధాని మోదీ చేసే ప్రతీ ప్రయత్నం దిగ్విజయంగా సాగుతుండడమే నిదర్శనం.

Recent Posts
Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.