In 100 Success Modi Govt

భారత దేశం తలసరి ఆదాయం 2047 నాటికి ప్రస్తుత తలసరి ఆదాయం రూ.1,72,000(ప్రస్తుత ధరల ప్రకారం) నుంచి ఆరు రెట్లు పెరిగి అధిక ఆదాయ దేశంగా మారుతుంది. అదే టైంలో 60కోట్ల ఉద్యోగాల కల్పించడం ద్వారా పెరుగుతున్న శ్రామికులకు లాభదాయక ఆదాయ మార్గం చూపనుంది. ఈ స్థాయిలో ప్రగతి సాధించడం ద్వారా 2047 నాటికి దాదాపు రూ.1500లక్షల కోట్ల(10 ట్రిలియన్ యూఎస్ డాలర్ల) ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ పాలన దక్షతకు మచ్చుతునక. ఈ విషయాలను ప్రఖ్యాత ఫిక్కీ-మెకెన్సీ నివేదిక ఇటీవల వెల్లడించింది.

ప్రధాని మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందనడానికి ఇదొక్కటే కాదు.. ఎన్నో సర్వేలు, నివేదికలు ఘనంగా చాటిచెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన పాలన కాలంలో చేసిన వైఫల్యాలను సరిదిద్దుకుంటూ మోదీ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాదాపు 60 ఏండ్ల కాలంలో చేసిన తప్పిదాలు, వైఫల్యాలు, సర్వ వ్యవస్థల వినాశనంతో దేశం కునారిల్లిపోయింది. వీటిని గమనించిన భారత ప్రజలు ఆ పార్టీని కోలుకోకుండా చేసినా.. ఆ పార్టీ ఇంకా పాఠాలు నేర్వడం లేదు. అదే ఆహంకారపూరిత ధోరణితో ప్రజలకు దినదినం దూరమైపోతోంది. అధికారంలో ఉన్నప్పడు రాజ్యాంగ వ్యతిరేక పనులెన్నో చేసి.. ఇప్పటికీ అదే నైజం ప్రదర్శిస్తున్నది.

అధికారంలో ఉన్నప్పుడు…
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అప్రతిహాతంగా పాలించిన పార్టీ.. దేశ ప్రగతిపై సరైన దిశా నిర్దేశం లేకుండా వ్యవహరించింది. పలు సందర్భాల్లో రాజ్యాంగాన్ని అపహస్యం చేసింది. ఇందిరా హయాం నుంచి ఇది మరింత పెరిగింది. తామే పాలకులం అన్నట్టుగా మరెవరూ పాలనలోకి రావొద్దని వారసత్వపు వైపరీత్యాలను ఎన్నింటినో ప్రదర్శించింది. 1975 ఎమర్జెన్సీ పాలన కాలంలోనైతే తనకు గిట్టని పార్టీలు, వ్యక్తులు, మీడియా, జనాలు.. ఇలా ఒకటేమిటి..అందరినీ నానా ఇబ్బందులకు గురి చేశారు. సర్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. తమ మంద బలంతో రాజ్యాంగానికి అనేక సవరణలు చేసి.. దేశాన్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూశారు. అయితే దాని పర్యవసనాలు తర్వాత వచ్చిన ఎన్నికల్లో కనబడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన హస్తం నేతల చెంపచెళ్లుమనిపించి గద్దె దించారు. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారిని గద్దె దింపడానికి నానా కుటిల ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకు ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ‘నాదెండ్ల’ను వాడుకున్న తీరును ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అలాగే మొన్నటి యూపీఏ-1,2 పాలనలోనూ అదే రాజ్యాంగ వ్యతిరేక పనులు ఎన్నింటినో హస్తం పార్టీ చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడునా అణిచివేసేందుకు ప్రయత్నించినా.. చివరకు ప్రజల ఆకాంక్షల ముందు తలొగ్గక తప్పలేదు. అయినా ఆ పార్టీని తెలంగాణ ప్రజలు దరిచేర్చుకోలేదు. అధికారం కట్టబెట్టలేదు.

ప్రజలు ఛీకొట్టినా..
ప్రజలు ఎంతగా ఛీకొట్టినా.. ఛీత్కరించినా ఆ పార్టీ తన వైఖరిని, వారసత్వ బుద్ధిని వదులుకోవడం లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా దేశ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవించడం లేదు. బీజేపీ ప్రభుత్వం చేసే ప్రతీ పనిని వ్యతిరేకిస్తూ.. ప్రజల్లోకి తన దురుద్దేశాలను తీసుకెళ్లాలని చూస్తున్నది. అయితే ప్రజలు ప్రతీ చోటా ఆ పార్టీకి మొట్టికాయలు వేస్తూనే ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ నానా యాగీ చేసింది. అక్కడి ప్రజాస్వామ్యాన్ని హరించి వేశారని, కాశ్మీరీలకు భద్రత లేకుండా పోయిందని ఆ పార్టీ అగ్రనేతలు.. గతంలో గొంతు చించుకున్నారు. అయితే ఇటీవల ఆ పార్టీ యువనేత కశ్మీర్ కు టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ లో అంత స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని ఆయనే స్వయంగా అనుభవించారు. ఇదొక్కటే కాదు.. మరెన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినా ఎన్నో మంచి పనులను ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఎన్నో ఏండ్లు మురగబెట్టినా మహిళా బిల్లుకు సైతం మొన్ననే మోదీ ప్రభుత్వం విజయవంతంగా పాస్ చేయించింది. బీజేపీ ప్రభుత్వం దేశమేలు కోసం చట్టాలు చేస్తుండడం, పేదలకు ప్రగతి ఫలాలు అందేలా పథకాలు తీసుకువస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బూజు పట్టిన వారసత్వ పోకడలు, అహంకార పూరిత ధోరణితోనే రోజుకింత చొప్పున కుంచించుకుపోతున్నది.

Recent Posts
Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.