In 100 Success Modi Govt

ఉగ్రవాద బెడదను తిప్పికొట్టడం, విదేశీ గడ్డపై యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న భారతీయులను కాపాడటంతో పాటు.. చైనా దురాగతాలను తిప్పికొట్టడంలో మోడీ ప్రభుత్వం అద్బుతంగా పనిచేస్తోంది. యుక్రెయిన్‌‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంతో అంతర్జాతీయంగా నెలకొన్న క్లిష్టతరమైన సంక్షోభాన్ని నిశితంగా గమనించడంలోనూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం భారత్ జాతీయ భద్రతకు ఒక ఒక పెద్ద అసెట్ లాగా పనిచేస్తోంది. పాలనాపరంగా వేర్వేరు రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్న మోదీ సర్కారు అదే సమయంలో పటిష్టమైన ఒక విదేశాంగ విధానానికి రూపకల్పన చేసి, దానిని అంతర్జాతీయ వేదికపై మోహరింపజేయడంలో అజేయంగా నిలిచింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి ఆగర్భ శత్రువులు సైతం ఇదే విషయాన్ని అంగీకరించారు. ‘అలీన విధానం’ వైఖరిని వదిలించుకోవడం నుంచి అంతర్జాతీయ వేదికలపై మన అస్తిత్వాన్ని చూపించుకోవడం దాకా.. మోడీ సర్కార్ సమర్థవంతంగా నిలబడుతోంది. అయితే పొరుగు దేశాలు ప్రేరేపిస్తున్న టెర్రరిజంపై ఉక్కుపాదాన్ని మోపడంలో కూడా మోడీ సర్కార్ సూపర అనిపించుకుంటోంది. ఇదంతా నూతన విదేశాంగ విధానం వల్లే సాధ్యం అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, మోదీ ప్రభుత్వం ఉన్నంత చురుకుగా గతంలో భారత్ విదేశాంగ విధానం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు భారత్ విదేశాంగ విధానం అత్యంత లోపభూయిష్టంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ‘నెహ్రూవియన్’ తప్పిదాలను చేసుకుంటూ పోయింది. కానీ, గత కొద్ది సంవత్సరాలుగా, ప్రధాని మోదీ హయాంలో భారత్ విదేశాంగ విధానంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టెర్రరిజాన్ని కూకటివేళ్ళతో పెకలించడంలో మోదీ నాయకత్వం ఉంది. అనాదిగా అనుసరిస్తున్న విధానాలకు అతీతంగా ముందుకు సాగాలనే తన సుముఖతను ప్రదర్శిస్తున్నట్టుగా దేశ సరిహద్దు వెంబడి తూర్పు, పశ్చిమ దిశల్లో సర్జికల్ దాడులను మోదీ నాయకత్వంలో భారత్ చేపట్టింది.

కరోనా మహమ్మారి కోరల్లో యావత్ ప్రపంచం చిక్కుకున్న సమయంలో స్వదేశీ టీకాను రికార్డు సమయంలో అభివృద్ధిపరిచి తయారు చేయడంలో తన శక్తియుక్తులను భారత్ ప్రదర్శించిది. పాశ్చాత్య కంపెనీల అభివృద్ధి చేసిన టీకాలను పెద్ద ఎత్తున తయారుచేయడంలో తన సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంది. విదేశీ దౌత్యం, మానవత్వం పట్ల తన కట్టుబాటుకు నిదర్శనంగా 100కు పైగా దేశాలకు 6.5 కోట్ల కోవిడ్ టీకా డోసులను భారత్ ఎగుమతి చేసింది.

పర్యావరణ మార్పు నుంచి వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. 2070 నాటికి దేశం నుంచి వెలువడే ఉద్గారాలను నెట్-జీరో‌కు తగ్గిస్తామని 2021 నవంబర్ రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. కాగా, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటి వరకు ఆయన నాయకత్వం పట్ల ప్రజలు ఆకర్శితులు అవుతూనే ఉన్నారు.

Recent Posts
Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.