ఏపీలో బీజేపీ ప్రయాణం ఎటు వైపు?,ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఓ వైపు, టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ మరోవైపు వెరసీ పొత్తుపై మాత్రం బీజేపీ పెద్దలు నోరు మెదపడం లేదు. అయితే ఆ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ-సేన కూటమిలో చేరేందుకు అగ్రనేత అమిత్ షా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అయితే పవన్ మాత్రం చంద్రబాబు – బీజేపీని కలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా అవి ఫలించేలా కనిపించడం లేదని టాక్. అందుకే చంద్రబాబుకు సమీప బంధువు అయిప బీజేపీ చీఫ్ పురందేశ్వరి సైతం పొత్తుపై ఎలాంటి హింట్ ఇవ్వడం లేదు.
ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేవలం 4 అసెంబ్లీ సీట్లే ఇవ్వనున్నట్లు ప్రచారం చంద్రబాబు వ్యాఖ్యానించారని చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అందుకే ఇంకా పొత్తుపై ఏం తేల్చలేదని తెలుస్తోంది. అవసరమైతే సింగిల్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారని ప్రచారం జరుగుతోంది.





