In 100 Success Modi Govt

కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ వెళ్తున్న ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం అప్పట్లో దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. మెజార్టీ ప్రజలు స్వాగతించగా, కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా దేశ శ్రేయస్సును తన భుజస్కంధాలపై మోస్తున్న ప్రధాని మోదీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు సరికదా.. సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేశారు. కోవిడ్ విలయంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అసలు సీఏఏ, ఎన్ఆర్ సీ అంటే వివరంగా చూద్దాం..

అసలేంటి దీని కథ..
సీఏఏ అనగా సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్( పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్ సీ అనగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్.

ఈ బిల్లును భారత పార్లమెంట్ 2019 డిసెంబర్ 10న లోక్ సభ, డిసెంబర్ 11న రాజ్యసభ ఆమోదించింది.

దీంతో పలువురు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా దీనిపై స్పందించారు. బీజేపీ దేశ బాగు కోసం నిర్ణయం తీసుకుంటే.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తదితర పార్టీలు కుహానా సెక్యూలర్ వైఖరితో నిరసనలు వ్యక్తం చేశాయి.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి హిందువులు, సిక్కులు, జైనులు, పార్శీలు, బౌద్ధులు, క్రైస్తవులు, మతపరమైన హింసల తర్వాత 2014 కంటే ముందు భారత దేశంలోకి వచ్చిన వలస దారులను అంగీకరించడానికి, వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిందే సీఏఏ.

ఇందులో ఇతర పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లింలు, ఇతర సంఘాల గురించి ఇందులో చర్చించలేదు.

శ్రీలంక నుంచి వచ్చే తమిళులు, మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలు, టిబెటన్ శరణార్థుల గురించి ఇందులో చర్చించలేదు.

సీఏఏ ద్వారా అంగీకరించబడిన వ్యక్తులకు ఎన్ఆర్సీ ద్వారా భారత దేశ పౌరులుగా నమోదు చేయబడతారు.

విమర్శలు దేనికి?
సీఏఏలో ముస్లింలను మినహాయించడంపై సంబంధిత వర్గాలు, పలు పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఎన్ఆర్సీని అమలు చేయవద్దని, తమ జాతీయతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పలువురు ఆందోళనల వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసోంలో నిరసనలు అధికంగా చెలరేగాయి. సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 14 సమానత్వ హక్కు ఈ చట్టం భంగపరుస్తుందని, దేశంలోని ముస్లిమేతరులకు ప్రాధాన్యమిస్తూ, ముస్లింలను దేశంలో రెండో శ్రేణి పౌరులుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆరోపిస్తూ తమ కుహానా లౌకిక వాదాన్ని మరోసారి బయటపెట్టుకున్నాి.

ఈ చట్టాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే..

-పొరుగు దేశాల నుంచి భారత్ లోకి చొరబడే అక్రమ వలస దారులను అడ్డుకోవడానికి ప్రధానంగా ఉద్దేశించింది.
-అలాగే ఆ దేశాల్లో మత హింస ద్వారా ఇబ్బందులు పడ్తున్న ముస్లిమేతర, స్వాతంత్ర్యం నాటికి ముందున్న భారత పౌరసత్వం ఉన్న వారికి మళ్లీ భారత్ లోకి రప్పించడం. వారికి రక్షణ కలపించడం.
-అక్రమ వలస దారులు సరిహద్దు రాష్ట్రాల్లోకి చొరబడి.. అక్కడి జన సమతుల్యతను పాడు చేయడం, అలాగే దేశ ద్రోహ చర్యలకు పాల్పడడం వంటి వాటిని అడ్డుకోవడం.

సీఏఏ, ఎన్ఆర్సీని దేశ మేలు కోసం తెచ్చిన మోదీ ప్రభుత్వాన్ని తమ రాజకీయ ప్రయోజనం ఆశిస్తూ కాంగ్రెస్ తదితర పార్టీలు వాడుకోవాలని చూశాయి. దేశ హితం గురించి ఎన్నడూ ఆలోచించని ఆ పార్టీ ఎప్పటిలాగే మెజార్టీ జనాల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించింది. సదరు మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించి భారత దేశ రక్షణకు పాటుపడాల్సి ఉండగా.. తన కర్తవ్యాన్ని మరిచి రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోయింది. వీటన్నంటిని గమనిస్తున్న మోదీ ప్రభుత్వం దేశ సేవే తన బాధ్యతగా ఎన్నెన్నో విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నది.

Recent Posts
Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.